Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
X

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. అమరావతి రైతులకు కౌలు చెల్లింపు అంశంలో సీఆర్డీఏ, సహా జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది.

రైతుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపించారు. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు కౌలు చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. ప్రతి ఏటా మేలో కౌలు చెల్లించేవారని.. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. సీఆర్డీఏ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated : 22 Aug 2023 3:56 PM IST
Tags:    
Next Story
Share it
Top