చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
X
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. తొలుత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఏజీ వాదనలకు లూథ్రా కౌంటరు వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదే కేసులో ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని లోకేష్ కు సీఐడీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని లోకేష్కు స్పష్టం చేసింది. దీంతో ఆయన ఈ నెల 10న జరిగే విచారణకు హాజరుకానున్నారు. కాగా టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువ పెంచుకునేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.