Home > ఆంధ్రప్రదేశ్ > Sharmila : ఏపీ కాంగ్రెస్ భవన్ వద్ద హై టెన్షన్.. రాత్రి నుంచి ఆఫీసులోనే షర్మిల

Sharmila : ఏపీ కాంగ్రెస్ భవన్ వద్ద హై టెన్షన్.. రాత్రి నుంచి ఆఫీసులోనే షర్మిల

Sharmila : ఏపీ కాంగ్రెస్ భవన్ వద్ద హై టెన్షన్.. రాత్రి నుంచి ఆఫీసులోనే షర్మిల
X

ఏపీలోని కాంగ్రెస్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది. భవన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు పెట్టారు. ఇవాళ ఛలో సెక్రటేరియట్కు షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రాత్రి ఆంధ్రరత్న భవన్ లోనే షర్మిల బస చేశారు. నిన్న గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న షర్మిల.. తొలుత కేవీపీ ఇంటికెళ్లి అక్కడే బస చేయాలనుకున్నారు. అయితే పోలీసులు ఫాలో అవ్వడం, హౌజ్ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆమె రూట్ మార్చి ఆంధ్రరత్న భవన్కు వెళ్లారు.

గత రాత్రి అక్కడే షర్మిల బస చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఛలో సెక్రెటేరియట్ నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసి మెగా డీఎస్సీ వేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను గృహ నిర్భంధాలు చేయడంపై ఆమె ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్లు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని నిలదీశారు. పోలీసులు అరెస్ట్ చేసినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

‘‘ నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు.. పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ?. మేము తీవ్రవాదులమా లేక సంఘ విద్రోహ శక్తులమా?. మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు’’ అని షర్మిల ట్వదీట్ చేశారు.

Updated : 22 Feb 2024 7:32 AM IST
Tags:    
Next Story
Share it
Top