చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వైసీపీ.. పుంగనూరులో హై టెన్షన్..
X
థంబ్ : రణరంగంలా మారిన పుంగనూరు
చిత్తూరు జిల్లా పుంగనూరు రణరంగంగా మారింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మీటింగ్కు వెళ్తున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడికి దిగారు.
వైసీపీ శ్రేణులు లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దాన్ని తొలగించాలని ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి.
పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్ వెంట వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
High tension at punganuru
andhra pradesh,chittor,punganuru,tdp chief chandrababu naidu,angallu,ysrcp,police,tear gas,police vehicle,lati charge,chandra babu convoy,stone pelting