Home > ఆంధ్రప్రదేశ్ > పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. ఆమె కథేంటంటే..?

పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. ఆమె కథేంటంటే..?

పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. ఆమె కథేంటంటే..?
X

పాకిస్థాన్‌ లో ఎన్నికల సందడి నెలకొంది. ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండటం విశేషం. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావీన్సులో బునేర్‌ జిల్లా నుంచి డాక్టర్‌ సవీరా పర్కాష్ ఎన్నికల బరిలోకి దిగింది. పీకే-25 స్థానానికి ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ తరుపున సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్‌ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ ఆమే కావడం విశేషం. ఖైబర్ పఖ్తుంక్వాలోని అబోటాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి సవీరా పర్కాష్ ఎంబీబీఎస్‌ పట్టా పొందారు.

సైవీరా తండ్రి ఓం పర్కాష్ రిటైర్డ్‌ డాక్టర్‌. గత 35 ఏళ్లుగా ఆయన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేర్‌లో పీపీపీ మహిళా విభాగానికి జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా జనరల్‌ స్థానాల్లో 5శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణ చేసింది. ఈ క్రమంలోనే సవీరా ఎన్నికల బరిలో నిలిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3వేల మంది మహిళలున్నారు. అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే.

Updated : 26 Dec 2023 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top