తుఫాన్ ఎఫెక్ట్.. రేపు స్కూళ్లకు సెలవు
X
మిచౌంగ్ తీవ్ర తుఫాను తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాను తీరం దాటడంతో.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో కృష్ణా, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.