మోడీ, కేసీఆర్, రాహుల్ ను నేనే ఢీ కొట్టగలను-కేఏ పాల్
X
వచ్చే ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్న పాల్
ఎన్ని సీట్లు వచ్చినా వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రిని అన్నారు కేఏ పాల్. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోనని...ఆ ఉద్దేశం కూడా లేదని చెప్పారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం అవుతానని అంటున్నారు.
నరేంద్రమోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీలను ఢీకొట్టే శక్తి నాకే ఉందని అన్నారు కేఏ పాల్. కేసీఆర్ మంత్రి వర్గంలో చాలామంది నాతో టచ్ లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని కేఏ పాల్ అన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ 90శాతం అవినీతి మయం అయిపోయిందన్నారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజెపీ 40 సీట్లు గెలుస్తుందని చెప్పాను. ఇదంతా బీజెపీ, బీఆర్ఎస్ ఒప్పందం అని ఆయన విమర్శించారు. కేసీఆర్...గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏరోజూ పట్టించుకోలేదని...ఆయన చనిపోతే మాత్రం అన్ని పార్టీల నాయకులూ వచ్చి వాలిపోయారని కామెంట్స్చేశారు కేఏ పాల్.
ఇక జగ్గారెడ్డిని బండబూతులు తిట్టారు కేఏపాల్. జగ్గారెడ్డి ఓ తొత్తు అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిని ఏ రోజూ అభివృద్ధి చేయలేదని తిట్టారు. అయినా కూడా ఇప్పుడు అతను వస్తానంటే నా పార్టీలో చేర్చుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్ లో చేరితే మాత్రం అతన్ని క్షమించేది లేదని అన్నారు. ఈ నెల 20న సంగారెడ్డి అభివృద్ధి మీద చర్చపెడతానని అన్నారు.
i am the next cm says ka paul. politics, ka paul, prajasanthi party, sangareddy, jaggareddy, kce, modi, rahul gandhi, elections, cm