చంద్రయాన్-3: ల్యాండింగ్కు పరిస్థితులు అనువుగా లేకపోతే?
X
భూమికి 3.84 లక్షల కి.మీల దూరంలో ఉన్న చంద్ర మండలాన్ని చేరుకొనేందుకు ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్.... చంద్రయాన్-3ను శుక్రవారం ప్రయోగించనుంది ఇస్రో. నెల్లూరులోని శ్రీహరి కోట స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించే రాకెట్ లక్ష్యం.. చంద్రున్ని లోతుగా పరిశీలించడమే. చంద్రుని వెనకవైపున్న దక్షణ భాగ రహస్యాల్ని వెలికి తీయడమే. ఈ భాగంలో సూర్యుడు పడడు. దాంతో ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో అక్కడ నివాసం ఉండొచ్చో లేదో తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అమెరికా, చైనాలను సాధ్యం కాని విషయాన్ని భారత్ చేసినట్లు అవుతుంది.
పరిస్థితులను బట్టి చంద్రయాన్-3ని ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా ప్రయోగిస్తారు. ఒకవేళ ఆ సమయానికి పరిస్థితులు ల్యాండింగ్ కి అనువుగా లేకపోతే.. మరో నెల రోజుల పాటు రోవర్ కక్షలోనే ఉంటుంది. ఆ తర్వాతే ల్యాండింగ్ కు ప్రయత్నిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ‘చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ విద్యుత్తుతో పనిచేస్తాయి. అంటే ల్యాండర్ దిగే సమయానికి చంద్రునిపై సూర్యరశ్మి ఉండాలి. అంటే పగటి సమయంలో మాత్రమే చంద్రయాన్-3 ల్యాండింగ్ జరగాల’ని సోమనాథ్ వివరించారు.