పొత్తు ఉంటే పార్టీ పెద్దలే ప్రకటిస్తారు...పురందేశ్వరి
X
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడబోతుండడంతో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అటు కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని స్థానాలకు తప్ప మిగితా వాటికి సీట్ల పంపకాలు కూడా చేసుకున్నాయి. రెండు పార్టీల నేతలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా బీజేపీతో ఈ పార్టీల పొత్తు విషయం ఇంకా తేలలేదు. ఇంకా హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాంన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక ప్రకటన చేశారు.
టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని చెప్పారు. కాగా తాము మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను రెడీ చేశామన్నారు. తమ జాబితాను రెండు రోజుల్లో హైకమాండ్ కు పంపుతామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు వచ్చారని వారిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామన్నారు. పార్లమెంటరీ కమిటీతో సమావేశం అనంతరం తుది అభ్యర్థుల లిస్ట్ ను ఖరారు చేస్తామన్నారు. మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని పురందేశ్వరి చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.