Home > ఆంధ్రప్రదేశ్ > ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆర్జీవీ..ట్వీట్ వైరల్

ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆర్జీవీ..ట్వీట్ వైరల్

ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆర్జీవీ..ట్వీట్ వైరల్
X

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ విషయం చెప్పినా అది కాంట్రవర్సీ అవుతుంది. ఎప్పుడూ ఏపీ పాలిటిక్స్‌పై, రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ నెట్టింట ఆర్జీవీ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ మధ్యనే ఆయన వ్యూహం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు శపథం అనే సినిమాతో రానున్నాడు. అయితే ఏపీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.

సడన్‌గా నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆర్జీవీ ఆ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఆయన పవన్‌పై సెటైరిటికల్‌గా ట్వీట్ చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించారు.

పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ ఆ ప్రకటన చేసిన కొంతసేపటికే రామ్ గోపాల్ వర్మ తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్మ నిజంగా పోటీ చేస్తాడా? లేక పవన్‌పై సెటైరికల్‌గా అలా అన్నాడా? అని నెటిజన్లు తికమకపడుతున్నారు.



Updated : 14 March 2024 1:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top