Home > ఆంధ్రప్రదేశ్ > Chicken Price : ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..కిలో ఎంతో తెలుసా?

Chicken Price : ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..కిలో ఎంతో తెలుసా?

Chicken Price : ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..కిలో ఎంతో తెలుసా?
X

ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగింది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పలు జిల్లాలో బర్డ్‌ప్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు రూ.300 కు చేరింది. ఎండలు ముదిరితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు నెలల్లో సగటున కిలో చికెన్ ధర రూ.180 నుంచి రూ.300కు చేరడంతో మాంస ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోడి గుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.5 పైనే పలుకుతోంది. ఇటీవల మేడారం జాతర కారణంగా కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ఆకాశనంటుతున్నాయి. కిలో లైవ్ కోడి ధర కూడా రూ. 180 వరకు చేరుకుంది.





గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. తెలంగాణలో కోడి మాంసం రేటులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో స్కిల్‌ లెస్ చికెన్ ధర రూ.280 నుంచి 300 వరుకు ఉంది.హైదరాబాద్ లో సగటున ప్రతి రోజు 12 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్ సేల్, రిటైల్ కలిపి కేవలం 6 వేల టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెపుతున్నారు. పండుగ సీజన్‌లో సీటిలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు అమ్ముతుంటారు. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. చికెన్ ధరలు అధికంగా ఉండటంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం అయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రబావం చూపింది. ఉత్పత్తి తగ్గిడం.. డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.




Updated : 28 Feb 2024 2:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top