Home > ఆంధ్రప్రదేశ్ > భక్తులకు గుడ్ న్యూస్.. దుర్గమ్మ కొండపైకి ఫ్రీ బస్సులు

భక్తులకు గుడ్ న్యూస్.. దుర్గమ్మ కొండపైకి ఫ్రీ బస్సులు

భక్తులకు గుడ్ న్యూస్.. దుర్గమ్మ కొండపైకి ఫ్రీ బస్సులు
X

విజయవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త. ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు నేటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దుర్గ గుడి ఛైర్మన్, ఈవోలు జెండా ఊపి సేవలు ప్రారంభించనున్నారు. కొండపై నుంచి దిగువన దుర్గా ఘాట్ స్నానాల రేవు వరకు నిత్యం బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

దుర్గమ్మ భక్తుల కోసం ప్రస్తుతం తొమ్మిది బస్సులు ఉన్నాయి. ఇందులో నాలుగు బస్సులను రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి దుర్గగుడికి నడుపుతున్నారు. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌ నుంచి కొండపైకి నడుస్తున్నాయి. ఇంకో రెండు బస్సులను పండుగలు, పర్వదినాలు, రద్దీ సమయాల్లో వినియోగిస్తున్నారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వేస్టేషన్, బస్టాండ్‌ నుంచి దుర్గగుడికి రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో 16 సార్లు, పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో 20 సార్లు బస్సులు తిరుగుతాయి.

సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల మంది.. శుక్రవారం, ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో 7 వేల నుంచి 10వేల మంది దేవస్థానం బస్సుల్లో ఇంద్రకీలాద్రిపైకి వెళ్తారు. తద్వారా దేవస్థానానికి భక్తుల ఛార్జీల ద్వారా ఏడాదికి సుమారు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఇంధనం, మరమ్మతులు, జీతాలు, ఇతర ఖర్చులు మినహాయించినా రూ. కోటి మేర ఆదాయం వస్తుంది. కరోనాకు ముందు రెండు బస్సుల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. కానీ కరోనా తర్వాత దానిని రద్దు చేశారు. తాజా అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించామని చెబుతున్నారు. అయితే కరోనా సాకుతో రెండేళ్లు బస్సులు ఆపి, ఎన్నికల వస్తున్నాయనే ఇప్పుడు మళ్లీ ఉచిత బస్సులు వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




Updated : 9 July 2023 9:17 AM IST
Tags:    
Next Story
Share it
Top