Home > ఆంధ్రప్రదేశ్ > ipac-pk : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఐపాక్ కీలక ప్రకటన

ipac-pk : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఐపాక్ కీలక ప్రకటన

ipac-pk : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఐపాక్ కీలక ప్రకటన
X

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడును కలవడం చర్చనీయాంశంగా మారింది. పీకే ఇవాళ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి నారా లోకేశ్‌తో కలిసి వచ్చారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. సుమారు 3గంటల పాటు పీకే-బాబు భేటీ జరిగింది. చంద్రబాబుతో పీకే మీటింగ్ నేపథ్యంలో ఐప్యాక్ టీం కీలక ప్రకటన చేసింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామని ఐప్యాక్ స్పష్టం చేసింది. ‘‘ గతేడాది నుంచి వైసీపీతో కలిసి పనిచేస్తున్నాం. 2024లో జగన్‌ మళ్లీ అద్భుత విజయం సాధించి.. ఏపీ ప్రజల జీవితాలను మరింత బాగు చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. జగన్ గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేయడానికి మేము అంకితభావంతో ఉన్నాం’’ అని ఐప్యాక్ ట్వీట్ చేసింది. మరోవైపు చంద్రబాబు సీనియర్ నాయకుడని.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు పీకే స్పష్టం చేశారు.

Updated : 23 Dec 2023 3:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top