Home > ఆంధ్రప్రదేశ్ > Mudragada Padmanabham : ఇక మాటల్లేవ్, మీకో నమస్కారం..పవన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham : ఇక మాటల్లేవ్, మీకో నమస్కారం..పవన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham : ఇక మాటల్లేవ్, మీకో నమస్కారం..పవన్‌కు ముద్రగడ లేఖ
X

ఏపీలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో కాపు నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. లేఖలో ముద్రగడ మాట్లాడుతూ..పవన్, ముద్రగడ కలయిక జరగాలని యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకుందన్నారు. జాతి కోరిక మేరకు తన గతాన్ని, తన బాధలను, అవమానాలను, కోరికలను అన్నీ మరిచి పవన్‌తో ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్లు తెలిపారు. పవన్‌తో కలిసి పోరాడాలనుకున్నానని, అయితే దురదృష్టవశాత్తు పవన్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.





చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కేడర్ మొత్తం ఇళ్లకే పరిమితమయ్యారని, ఆ సమయంలో జైల్లో ఉన్న బాబుకు పవన్ భరోసా ఇవ్వడమనేది సామాన్యమైన విషయం కాదన్నారు. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరిగేందుకు పవనే కారణమని ముద్రగడ అన్నారు. ప్రజలంతా పవన్‌ని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటే పవన్ వేరే మార్గాన్ని ఎంచుకున్నారన్నారు.

పవర్ షేరింగ్ విషయంలో చంద్రబాబును 80 అసెంబ్లీ సీట్లు, రెండేళ్ల సీఎం పదవిని అడిగి ఉండాల్సిందని, కానీ పవన్ ఆ సాహసం చేయకపోవడం బాధాకరమన్నారు. పరపతి లేనివాడిగా, లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుములాంటి వాడిగా తనను చూశారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాలు ఏవీ పవన్ చేతుల్లో ఉండవని, చాలా చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 24 మందికి తన అవసరం రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం తన లేఖలో చెప్పుకొచ్చారు.


Updated : 29 Feb 2024 6:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top