Sharmila : జగన్ అధికారంలోకి వచ్చి చేసిందేమి లేదు..షర్మిల
X
జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. తిరుపతిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో పాల్గొన్న ఆమె వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని..ఆయన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకొలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు ఆకాశానికి..పాతాళానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గాలేరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని జగన్ ఇప్పటివరకు దాన్ని పట్టించుకొలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక గాలేరు ప్రాజెక్ట్ అటకెక్కిందని అన్నారు. అంతేగాక, బీజేపీకి సరికొత్త అర్థం చెప్పారు షర్మిల. బీజేపీ అంటే బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని స్పష్టం చేశారు. వీళ్లకు ఓటు వేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్టే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.