Home > ఆంధ్రప్రదేశ్ > ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
X

ఆంధ్రప్రదేశ్ లోని ఏపీఎస్ఆర్టీసీ (Apsrtc) ఉద్యోగులకు జగన్ (CM Jagan) సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచి జీతంతో పాటుగా అకౌంట్లో బోనస్ డబ్బులను కూడా వేయనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు డే ఔట్, నైట్ ఔట్ భత్యాల (TA) కింద రోజుకు రూ.150 నుంచి రూ.400లను ప్రభుత్వం అమలు చేయనుంది. ఆ డబ్బులను మార్చి 1వ తేదిన ఇచ్చే జీతంలో కలిపేందుకు జగన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ED) కమిటీ అంగీకరించినట్లుగా ఎన్ఎంయూఏ తెలిపింది.

సమస్యల పరిష్కారానికి చర్యలు

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీతో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) గత రెండు రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో పలు రకాల సమస్యల గురించి ఆలోచించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లుగా వెల్లడించింది. అలాగే అన్ని సమస్యలను అతి త్వరలో పరిష్కరించే మార్గాలను, నిబంధనలను తీసుకురానున్నట్లుగా ఎన్ఎంయూఏ తెలిపింది. అలాగే ఆర్టీసీ (RTC)లో చేరినప్పుడు ఉండే విద్యార్హతల ఆధారంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS)ను అమలు చేయడానికి అంగీకరించింది.

అంతర్ జిల్లాల బదిలీలకు శ్రీకారం

ఇకపై ఆర్టీసీ (RTC) వైద్యుడితో పాటుగా ప్రభుత్వ వైద్యుడు ఇచ్చినటువంటి సిక్ లీవును కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. తగిన విద్యార్హతలు లేని డ్రైవర్లను టిమ్ సర్వీసుల్లో విధులకు పంపబోమని స్పష్టం చేసింది. అలాగే యూనిఫామ్, సీట్ వంటి అన్ని భత్యాలూ ఇవ్వడానికి, అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టేందుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ అంగీకారం తెలిపినట్లుగా ఎన్ఎంయూఏ వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees ) హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 2 Feb 2024 1:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top