Jagan Mohan Reddy : చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..జగన్
X
భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై జగన్ విరుచుకుపడ్డారు. పొత్తులేకపోతే పోటికి అభ్యర్థులు లేనివాళ్లు వైసీపీ పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల్లో లేని దిగజారుడు పార్టీలు..తనను టార్గెట్ చేస్తూ ఆయుధాలు రెడీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలు వంచనకు, విశ్వసనీయతకు మధ్య యుద్ధంగా పేర్కోన్నారు. ప్రతిపక్షాల దాడులను ప్రజలంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని..తను ఏ దత్తపుత్రుడు, పొత్తులను నమ్ముకొలేదని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాలో దుష్ట చతుష్టయం చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లబ్ధిపొందిన మహిళలే వైసీపీ స్టార్ క్యాంపెనర్లని చెప్పారు. గజదొంగల ముఠాను ఓడించేందుకు సిద్దమా అంటూ సభను ఉద్దేశించి ప్రశ్నించారు. అటు వైపు కౌరవ సైన్యం ఉందని..కురుక్షేత్రానికి సిద్దమైన పాండవ సేన ఇటువైపు కనిపిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలను ఉద్దేశించి పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశా నిర్థేశం చేశారు.