Home > ఆంధ్రప్రదేశ్ > భువనేశ్వరి ములాఖత్కు నో.. జైళ్ల శాఖ ఏం చెప్పిందంటే?

భువనేశ్వరి ములాఖత్కు నో.. జైళ్ల శాఖ ఏం చెప్పిందంటే?

భువనేశ్వరి ములాఖత్కు నో.. జైళ్ల శాఖ ఏం చెప్పిందంటే?
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ములాఖత్ లో భాగంగా శుక్రవారం (సెప్టెంబర్ 15)న బాబును కలవడానికి ఆయన భార్య నారా భువనేశ్వరి వెళ్లారు. అయితే జైళ్ల శాఖ అధికారులు ములాఖత్ ను నిరాకరించి భువనేశ్వరిని వెనక్కి పంపించారు. సరైన కారణాలు చూపకుండా తనను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఖైదీలకు వారానికి మూడుసార్లు ములాఖత్ అవకాశం ఉన్నా ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ‘నా భర్తను అక్రమంగా అరెస్టు చేసి చేశారు. కేసులో జరగాల్సినవి జరుగుతాయి. కానీ నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అనుమతి ఇవ్వకపోవడం అమానవీయం’ అని మండిపడ్డారు.

భువనేశ్వరి ఆరోపణలను జైళ్ల శాఖ అధికారులు ఖండించారు. ‘‘భువనేశ్వరి ములాఖత్ కోసం అప్లై చేసుకున్న మాట వాస్తవం. అయితే రిమాండ్ ఖైదీకి ఒక వారంలో రెండు ములాఖత్ లు మాత్రమే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా జైల్ సూపరిండెంట్ అనుమతిస్తే మూడో ములాఖత్ కు అనుమతి ఉంటుంది. భువనేశ్వరి దగ్గరున్న లెటర్ లో అత్యవసర కారణాలతో ములాఖత్ కు వచ్చినట్లు ప్రస్తావన లేదు. ఆ కారణంతో మూడో ములాఖత్ ను తిరస్కరించాం’’ అని వివరణ ఇచ్చారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీస్ అధికారులు ప్రభుత్వంతో కుమ్మక్కై కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Updated : 16 Sept 2023 9:24 PM IST
Tags:    
Next Story
Share it
Top