ఫస్ట్ ఓడిపోయేది మంత్రి రోజానే - నటుడు పృథ్వీరాజ్
X
టాలీవుడ్ యాక్టర్, జనసేన నేత పృథ్వీరాజ్ మంత్రి రోజాపై మరోసారి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజానే అని అన్నారు. ఫట్ మని ఎగిరిపోయే వికెట్ ఆమెదేనని, రోజా క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. డైమండ్ రాణిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామని పృథ్వీరాజ్ అన్నారు. గతంలో రోజా చేసిన అసందర్భ వ్యాఖ్యలకు తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక మరో మంత్రి కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని, ఆయనకు ఇక సంక్రాంతి డ్యాన్సులే దిక్కు అని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఉపాధి కల్పిస్తామని, సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ లకు పిలుస్తామని ఎద్దేవా చేశారు.
శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు జనసేన-టీడీపీ కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పృథ్వీరాజ్ అన్నారు. కాగా నటుడు పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయనను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ డైరెక్టర్ గా వైసీపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో వైసీపీ ఆయనను దూరం పెట్టింది. దీంతో కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మధ్యకాలంలోనే జనసేనలో చేరి క్రియాశీల రాజకీయాలు చేస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.