జనసేన మొదటి జాబితా.. పవన్ కళ్యాణ్, నాగబాబుల పేర్లెక్కడ
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు పార్టీల నుంచి పోటీ చేసే 118 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. పొత్తులో భాగంగా తొలి విడతలో జనసేనకు మొత్తం 24 స్థానాలు దక్కాయి. అందులో 5 అసెంబ్లీ స్థానాలకు జనసేనాని అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఈ లిస్ట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వాళ్ల అన్న నాగబాబు పేర్లు కూడా ఈ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం.
జనసేన అభ్యర్థులు:
నెల్లిమర్ల- లోకం మాధవి
అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ - పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్
రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.