Home > ఆంధ్రప్రదేశ్ > జగన్‌పై మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. వలంటీర్ల రచ్చపై..

జగన్‌పై మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. వలంటీర్ల రచ్చపై..

జగన్‌పై మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. వలంటీర్ల రచ్చపై..
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర ఆరోపణలను సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కొట్టిపడేశారు. సంస్కారం ఉన్న వ్యక్తులు వలంటీర్లను విమర్శించరని అన్నారు. వెంకటగిరి సభలో ఆయన మాట్లాడుతుండగా పవన్ కూడా ట్వటరో ఎందురుదాడి దిగారు. అసలు వలంటీర్లు ఎవరని, వారినికి బాస్ ఎవర తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘వలంటీర్ల బాస్ ఎవరు? ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించాలని వారికి ఎవరు చెప్పారు? ఆ వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? అది ఆంధప్రదేశ్ ప్రభుత్వమైతే వివరాలు సేకరించమని ఎవరు ఆదేశించారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? ముఖ్యమంత్రా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?’’ అంటూ ప్రశ్నించారు.

ట్వీట్‌ను ప్రధాని, కేంద్ర హోం మంత్రి కార్యాలయాలకు ట్యాగ్ పెట్టి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ భేటీకి పవన్ హాజరైన నేపథ్యంలో వలంటీర్ల అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. వలంటీర్లు ప్రజల డేటా సేకరిస్తూ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం వారి సాయంతో స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటోందని పవన్ ఆరోపించడం తెలిసిందే.


Updated : 21 July 2023 3:55 PM IST
Tags:    
Next Story
Share it
Top