పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో..మంత్రి అంబటి
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై, ఏపీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో అని , రియల్ లైఫ్‌లో కంత్రీ నాయకుడని తీవ్రస్థాయిలో మంత్రి విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో నారా లోకేష్ చేస్తున్న యువగళానికి అసలు గళమే లేదన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. " హలో ఏపీ నా పార్టీని అమ్మేశానంటూ’ వారాహిపై పవన్ ఊగిపోతున్నాడు. నిలకడలేని పవన్ , పాలిటిక్స్‌కు పనికిరాడు. పవన్ కల్యాణ్ గళం గరళం. ఆయన ఎక్కిన తరువాత వారాహి వరాహమైంది. పవన్ సినిమాల్లోనే హీరో. నిజజీవితంలో కంత్రీ నాయకుడు. ఇక నారా లోకేశ్ చేస్తున్న యువగళానికి అసలు గళమే లేదు. యువగళంలో విద్వేషాలను రెచ్చగొడితే సహించేది లేదు. రానున్న ఎన్నికల్లో జగన్ ఓడిపోతే రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న అమ్మఒడి, రైతు భరోసా, విద్యా కానుక, పింఛను కానుక వంటి ఎన్నో పథకాలు ఆగిపోతాయి. పోలవరంపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర ఓ తుస్సు యాత్ర" అని మంత్రి అంబటి విమర్శించారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.