పవన్.. నువ్వు జాగ్రత్త.. గద్దర్ సలహా
X
కొన్నిరోజులుగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గద్దర్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామార్శించారు. చికిత్సపై ఆరా తీసి.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పవన్ రాకపై గద్దర్ సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయం పద్మవ్యూహం లాంటిదని.. జాగ్రత్తగా వ్యహరించాలని పవన్కు గద్దర్ సూచించారు. దేశం యువతతో నిండివుందని గద్దర్ అన్నారు. నేటి యువతకు పవన్ లాంటి నాయకుడు అవసరమని చెప్పారు. పవన్కు విజయం దక్కాలని ఒక్క అన్నగా ఆకాంక్షిస్తున్నట్లు గద్దర్ తెలిపారు.
బ్రో జోరు..
కాగా పవన్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఇవాళ రిలీజైంది. థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మూడేళ్ల క్రితం విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి ఇది రిమేక్. అయితే పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేశారు. మార్క్ క్యారెక్టర్ను ఆటపట్టిస్తూ పవన్ కల్యాణ్ చేసే హంగామా సినిమాకు హైలైట్గా నిలిచిందని టాక్. ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు.