బిందు ప్రేమలో పడిపోయిన పవన్ కల్యాణ్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బిందు సేదదీర్చింది. ఆయనలో ఉల్లాసం, ఉత్సాహం నింపింది. ఇద్దరి మధ్య అనూహ్యమైన స్నేహబంధం మొదలైంది. ఆయన మనసు దోచుకున్న ఆ బిందు మనిషి కాదు, పోలీసు కుక్క!
బేగంపేట్ విమానాశ్రయం ఈ అనురాగ బంధానికి వేదికైంది. బిందు ప్రేమలో పడిపోయానని పవన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియో షేర్ చేశారు. తను విమానం ఎక్కడానికి వేచిచూస్తుండగా బిందు తన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించిందని చెప్పారు. ‘‘నేను వేచి చూస్తుండగా ఓ అనూహ్య విజిటర్ నా దగ్గరికి వచ్చింది. డాగ్ స్క్వాలోని ఆత్మీయ సభ్యురాలు అది, పేరు బిందు. సంతోషంతో తోక తెగ ఊపుతూ, ఎంతో స్నేహంగా వచ్చి నాలో ఉత్సాహం నింపింది. టేకాఫ్‌కు ముందు సాంత్వన కలిగించి, అనూహ్య అనుబంధాన్ని అందించింది’’ అని పవన్ రాశారు. పవన్ ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో బిజీగా ఉన్నారు. ఏపీలో, తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన చేస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలకు కాస్త బ్రేక్ వచ్చింది.