వెనక్కి తగ్గని పవన్.. ఆ శ్రద్ధ దానిపై పెట్టు జగన్ అంటూ..
X
ఏపీలో భారీస్థాయలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందని, వలంటీర్లకు, వైకాపా నేతలకు ఆ రాకెట్లో భాగముందని సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానన్న ఆయన సోమవారం మరో ఘాటు విమర్శ చేశారు. బటన్ నొక్కే సీఎం అంటూ జగన్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ ట్వీట్ చేశారు. ఏలూరులోని ప్రభుత్వ కాలేజీలో చెట్ల కింద చదువులు చెప్తున్న ఫోటోలతో జత చేశారు.
‘‘చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్’’ అని వవన్ ట్వీట్ చేశారు. జగన్ ప్రతి పథకానికి, ప్రతి పెన్షన్‌కు బటన్ నొక్కతుడుండడంతో పవన్ బటన్ ప్రస్తావించారు. కాగా, పవన్ వ్యాఖ్యాపై వలంటీర్లు, వైకాపా నేతలు భగ్గమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం పలు చోటు ఆయన దిష్టిబొమ్మలను కాల్చేస్తూ, ఫోటోను చెప్పులతో కొడుతున్నారు.
చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్. pic.twitter.com/S51eoSHcp7
— Pawan Kalyan (@PawanKalyan) July 10, 2023