Home > ఆంధ్రప్రదేశ్ > జనసేనకు షాక్.. వైసీపీలోకి కీలక నేతలు

జనసేనకు షాక్.. వైసీపీలోకి కీలక నేతలు

జనసేనకు షాక్.. వైసీపీలోకి కీలక నేతలు
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది. ఏపీలోని ప్రముఖ పార్టీలు వైసీపీ, టీడీపీల మధ్యే పోటీ ఉండనుంది. బీజేపీ, జనసేన పొత్తులో టీడీపీ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల అధినేతలంతా ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు.. వైసీపీ గూటిలో చేరారు. సోమవారం కృష్ణా జిల్లా పెడన జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. యడ్లపల్లి రామ్‌ సుధీర్‌, రామ్‌ సుధీర్‌ పాటుగా జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు కూడా వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.



Updated : 18 Dec 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top