జగన్.. ఆ డబ్బు ఏం చేశావో చెప్పు, నీకు అర్హత లేదు.. జగన్
X
సీఎం జగన్ మోహన్ నెడ్డి ప్రజలకు చెప్పకుండా భారీగా అప్పులు చేసి దారి మళ్లిస్తున్నారని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కాగ్ నిన్నెందుకు ప్రశ్నించింది? నువ్వు, నీ మంత్రులు జవాబు చెప్పాలి?’’ అని డిమాండ్ చేశారు. రెండో విడత వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనపై వైకాపా నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, వారిని దీటుగా ఎదుర్కొంటానని అన్నారు. జగన్ సీఎం పదవికి అర్హుడు కాకపోయినా ఆ పదవికి తను విలువ ఇస్తానన్నారు.
‘‘మీరు నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే నేను కూడా జగన్‌ను, వైసీసీ నేతలను ఏకవచనంతోనే పిలుస్తాను. ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి బానిసలు కాదు. అతడు మనలో ఒకడు. వైసీపీ పాలనతో ఏపీ నష్టపోయింది. అది ఈ రాష్ట్రానికి పనికిరాదు’’ అన్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. ‘‘జగన్ లక్షా 18 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ప్రజలకు లెక్క చెప్పడం లేదు. కాగ్ నిన్ను ఎందుకు ప్రశ్నించిందో చెపు. నువ్వు, నీ మంత్రులు నోరు విప్పండి. రూ. 22 వేల కోట్లు లిక్కర్ బాండ్లు పెట్టి తీసుకున్న అప్పు సొమ్మును ఏం చేశారు? రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు ఏమైంది?’’ అని నిలదీశారు. జగన్ ఇన్నేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేని, ప్రజలకు జవాబు చెప్పలేనప్పుడు సీఎం కుర్చీ వదిలేసి ఇడుపులపాయ ఎస్టేట్లో కూర్చోవాలని ఎద్దేశా చేశారు.
నేను ప్రశ్నిస్తే నా భార్య గురించి మాట్లాడుతున్నారు..
ప్రభుత్వ అసమర్థ పాలనను తను ప్రశ్నిస్తే వైకాపా నేతలు తన భార్యను, తల్లిని తిడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మద్యపాన నిషేధం పేరతో అధికారంలోకి వచ్చిన ఆడవాళ్ల తాళిబొట్టు తెంచాడు. చెత్తమీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే మురిసిపోవద్దు’’ అన్నారు. ఏపీలో ఆడపిల్లను అక్రమరవాణా చేస్తున్నారని, ఈ రాకెట్ వెనక అధికార పార్టీ నేతల హస్తముందని ఆరోపించారు.