Home > ఆంధ్రప్రదేశ్ > Janasena Party : ఆసక్తిగా ఏపీ పాలిటిక్స్.. పెరిగిన జనసేన బలం!

Janasena Party : ఆసక్తిగా ఏపీ పాలిటిక్స్.. పెరిగిన జనసేన బలం!

Janasena Party : ఆసక్తిగా ఏపీ పాలిటిక్స్.. పెరిగిన జనసేన బలం!
X

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో పలువురు నేతలు, ప్రముఖులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటుడు పృ‌థ్వీ రాజ్, కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి ఆహ్వానించారు. జానీ మాస్టర్, పృ‌థ్వీ రాజ్ చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Updated : 24 Jan 2024 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top