Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం
X

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. ఆయన కొత్త సీజేగా బాధ్యతలు స్వీకరించిన సీఎం జగన్‌ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ తండ్రి, సోదరుడు న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తీర్థసింగ్‌ ఠాకూర్‌ సోదరుడే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌కు పేరుంది. బాంబే హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగిన ఆయన పదోన్నతి లభించడంతో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జస్టిస్ ధీరజ్ సింగ్ 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ సీజేగా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ సింగ్ ప్రమోషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర కోటా నుంచి జడ్జిలు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నెంబర్‌ 2గా కొనసాగనున్నారు. ఆయన త్వరలోనే వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లే ఛాన్సుంది.




Updated : 28 July 2023 11:21 AM IST
Tags:    
Next Story
Share it
Top