Home > ఆంధ్రప్రదేశ్ > లక్షలు పలికిన కచ్చడి చేప.. ఇంతకీ స్పెషాలిటీ ఏంటి..?

లక్షలు పలికిన కచ్చడి చేప.. ఇంతకీ స్పెషాలిటీ ఏంటి..?

కాకినాడ రేవులో ఓ చేపకు ఏకంగా 3 లక్షలు ధర పలికింది. వర్షాకాలం కావడంతో చేపలకు డిమాండ్ బాగా పెరిగింది. సాధారణంగా ఈ సీజన్ లో పులసకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ చేప ధర లక్షల్లోపలుకుతుంది. కానీ ఇప్పుడు కచ్చడి అనే రకం చేపకు అత్యధిక ధర పలికింది.

కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. ఈ చేప బరువు కూడా ఎక్కువే. మొత్తం 25 కిలోలు ఉంది. సముద్రంలో ఉండే కచ్చడి చాలా అరుదుగా దొరుకుతుంది అని చెబుతున్నారు మత్స్యకారులు. చాలా వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లాడర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఔషధ గుణాలు కలిగిన కచ్చిడి చేప కోసం ఎదురుచూసే మత్స్యకారులకు ఇది ఒక వరమనే చెప్పాలి. ఈ చేప దొరికింది అంటే వాళ్ళ పంట పండినట్టే.

Updated : 22 July 2023 1:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top