Home > ఆంధ్రప్రదేశ్ > యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..30 మంది అస్వస్థత

యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..30 మంది అస్వస్థత

యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..30 మంది అస్వస్థత
X

కడపలోని యోగి వేమన యూనివర్సటీలో హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి విద్యార్థులు వంకాయ కూర రసంతో భోజనం చేశారు. ఆ తర్వాత వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుట హుటి హాస్పటల్‌కి తరలించారు. అయితే విశ్వవిద్యాలయం అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వారిని ప్రభుత్వ ఆస్సత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి అన్నం అన్నం తిన్నారు దీంతో పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

Updated : 22 Feb 2024 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top