Home > ఆంధ్రప్రదేశ్ > 14న వైసీపీలో చేరనున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం

14న వైసీపీలో చేరనున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం

14న వైసీపీలో చేరనున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం
X

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 14వ తేదిన ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబుతో పాటుగా ఇంకొంత మంది కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. కిర్లపూడి నుంచి భారీ సంఖ్యలో తన అనుచరులతో తాడేపల్లికి ముద్రగడ రానున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈమధ్యనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ముద్రగడ పద్మనాభంతో వైసీపీ సీనియర్ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ తర్వాత తాను వైసీపీలో చేరుతానని హామీ ఇచ్చారు. ఎలాంటి పదవులు ఆశించకుండా, తాను వైసీపీకి తన సేవలు అందిస్తానని ముద్రగడ చెప్పినట్లు తెలుస్తోంది. ముద్రగడ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో ముద్రగడ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకునేందుకు వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఏపీలోని కాపు ఓటర్లు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపకుండా వైసీపీ అధిష్టానం ముద్రగడ పద్మనాభం సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముద్రగడ పద్మనాభం ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ కుమారుడు గిరిబాబు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ముద్రగడకు కూడా నామినేటెడ్ పదవి ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది.


Updated : 10 March 2024 6:16 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top