Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల కొండపై కుక్క హల్ చల్.. భక్తులు సీరియస్

తిరుమల కొండపై కుక్క హల్ చల్.. భక్తులు సీరియస్

తిరుమల కొండపై కుక్క హల్ చల్.. భక్తులు సీరియస్
X

తిరుమల కొండపై ఓ కుక్క హల్ చల్ చేసింది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకి వచ్చిన కర్ణాటక భక్తులు.. తమ వెంట వాహనంలో పెంపుడు కుక్కని కూడా తిరుమలకి తీసుకొని వచ్చారు. కొండపైన వన్య మృగాల సంచారం నేపథ్యంలో పెంపుడు జంతువులను తిరుమలకి తీసుకురాకూడదనే నిషేధం ఉంది. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో కూడా శునకాలని పెంచడాన్ని టీటీడీ నిషేధించింది. అయితే కర్ణాటకకి చెందిన భక్తులు మాత్రం వారి టెంపో వాహనంలో కుక్కని తీసుకొచ్చారు. అలిపిరి వద్ద చెక్ పోస్ట్ ఉన్నా కూడా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోలేదు.





భక్తులు కుక్కని వారి వాహనంలోనే పెట్టుకొని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందిపై భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం పెరిగిన నేపథ్యంలో శునకం కోసం చిరుత జనవాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలిపిరి తనిఖీ సమయంలో.. టిటిడి సిబ్బంది గుర్తించి ముందస్తుగానే అనుమతిని నిరాకరించాలని భక్తులు కోరుతున్నారు.





ఇంతకుముందు కూడా టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వహించారు. కొన్ని రోజుల క్రితం ఆనంద నిలయం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. అధికారులు రాహుల్ రెడ్డి అనే భక్తుడు ఈ వీడియోని తీసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామని, అందుకు కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు. కానీ ప్రస్తుత జరిగిన విషయం చూస్తుంటే.. సిబ్బందిలో ఎలాంటి మార్పూ రానట్లు కనిపిస్తోంది.




Updated : 4 July 2023 11:42 AM IST
Tags:    
Next Story
Share it
Top