Home > ఆంధ్రప్రదేశ్ > RTC డ్రైవర్‌పై దాడి ఘటన.. దుండగులు దొరికారు

RTC డ్రైవర్‌పై దాడి ఘటన.. దుండగులు దొరికారు

RTC డ్రైవర్‌పై దాడి ఘటన.. దుండగులు దొరికారు
X

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దాడి విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. శివారెడ్డి, విల్సన్‌, మహేశ్‌, రాజీ, మల్లి, ఇలియాజ్‌ను అనే వ్యక్తులను(నిందితులను) పట్టుకున్నామని, ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తో పాటు దాడి చేసిన మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అరెస్టు చేసిన నిందితులను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.





గురువారం సాయంత్రం కావలి మండలం మద్దూరుపాడు నేషనల్ హైవే పై ఈ దాడి జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడ వస్తోన్న ఆర్టీసీ బస్సు... సాయంత్రం వేళ కావలి నుంచి విజయవాడకు బయలుదేరింది. దారిలో ఓ బైక్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌ హారన్ మోగించారు. దీంతో ఆ బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు డ్రైవరుతో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు కల్పించుకుని బస్సును అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ విషయాన్ని బైక్ పై ఉన్న తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపాడు. మొత్తం 14 మంది వ్యక్తులు కారులో ఆ ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. బస్సు నుంచి డ్రైవర్‌ను కిందకు దింపి పిడిగుద్దులు గుద్దారు, కాలితో తన్నుతూ కొట్టారు. పీక మీద కాలితో తొక్కారు. గురువారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.





నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెంగుళూరు నుంచి విజయవాడ వస్తోన్న AP 16Z 0702 నెంబర్ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బి.ఆర్.సింగ్ పై TN C9 1612 నంబర్ గల కారు డ్రైవర్, కారులో వ్యక్తులు భౌతికంగా దాడి చేశారని పోలీసులు గుర్తించారన్నారు. నిందితులపై ipc సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.




Updated : 29 Oct 2023 8:48 AM IST
Tags:    
Next Story
Share it
Top