Home > ఆంధ్రప్రదేశ్ > Keerthi Naidu : 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి.. తన లక్ష్యం..

Keerthi Naidu : 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి.. తన లక్ష్యం..

చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉంటుంది. ఒక్క ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతుంటారు. మరికొందరు అయితే ఏళ్లకేళ్లు కష్టపడ్డా ఉద్యోగం రాక నిరాశ చెందుతుంటారు. అయితే ఓ యువతి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వారెవ్వా అనిపించుకుంది. ఏపీలోని ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తి నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అయినా ఆమె లక్ష్యం మాత్రం నెరవేరలేదు అంటోంది.

కీర్తి నాయుడు తాజాగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. 2019 స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించిన ఆమె.. ఆ తర్వాత కస్టమ్స్‌ డిపార్ట్మెంట్లో ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. గతేడాది మార్చిలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇంటర్‌ బేస్డ్‌ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్‌ జాబ్, రైల్వేలో ఆఫీసర్గా, పోస్టల్‌ విజిలెన్స్ విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికయ్యారు. 2019 నుంచి ఇలా 7 ఉద్యోగాలకు ఎంపికైంది. అయితే సివిల్స్‌ సాధించి దేశసేవ చేయడమే తన లక్ష్యమని కీర్తి నాయుడు చెబుతోంది.


Updated : 7 Dec 2023 11:08 AM IST
Tags:    
Next Story
Share it
Top