Home > ఆంధ్రప్రదేశ్ > ఆ ఇంఛార్జులు ఎవరు.. గొట్టంగాళ్లు.. టీడీపీ అధిష్టానంపై కేశినేని నాని ఫైర్

ఆ ఇంఛార్జులు ఎవరు.. గొట్టంగాళ్లు.. టీడీపీ అధిష్టానంపై కేశినేని నాని ఫైర్

ఆ ఇంఛార్జులు ఎవరు.. గొట్టంగాళ్లు.. టీడీపీ అధిష్టానంపై కేశినేని నాని ఫైర్
X


తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదన్నారు నాని. విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా పిలవలేదన్నారు. ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలను గొట్టంగాళ్లు అంటూ నాని వ్యాఖ్యానించారు. పార్టీ ఆర్గనైజేషన్ నిమిత్తం నియోజకవర్గ ఇంచార్జీలను ఏర్పాటు చేసుకుంటారన్నారు. కానీ ఇంచార్జీల నియామకం రాజ్యాంగ పదవి కాదన్నారు. నాకు ఒళ్లు మండితే..వేరే పార్టీలోకి పోతానని సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తున్నానని.. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్ గా కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టం గాడని, చెప్పుతో కొడతా అన్నారని.. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశామని చురకలు అంటించారు. అలాంటి గొట్టం గాళ్ళ గెలుపు కోసం కూడా పని చేస్తున్నా.. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నానని వెల్లడించారు.

ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని నాని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా విజయవాడలోని తన ఆఫీస్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.

మహానాడులో తన కంట్రీబ్యూషన్ ఏమీ లేదన్నారు కేశినేని నాని. రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికి ఉన్న ప్రయార్టీ మరెవరికీ లేదన్నారు. ఎందుకని విలేకర్లు ప్రశ్నిస్తే ఈ విషయాన్ని చంద్రబాబునో అచ్చెన్నాయుడినో అడగాలని సూచించారు. సిట్టింగ్ ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని... అచ్చెన్న మాత్రం ఓపెనింగ్‌ వచ్చారన్నారు. దీని వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై కూడా ఎవర్నీ తాను ఏమీ అడగలేదన్నారు. తన వెంట ప్రజలు ఉన్నారని ప్రజల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పొమ్మనలేక పొగబెడుతున్నారా అంటే దానికి కూడా అడగాల్సిన వాళ్లను అడగాలన్నారు. ప్రజలు అనుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానన్నారు.




Updated : 8 Jun 2023 2:53 PM IST
Tags:    
Next Story
Share it
Top