Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో ప్రభుత్వ పథకాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి

ఏపీలో ప్రభుత్వ పథకాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి

ఏపీలో ప్రభుత్వ పథకాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి
X

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఏపీ సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పథకాల అమలులో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో పతి పథకానికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ శుక్రవారం గెజిట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది. ఇకపై ఏపీలో ప్రభుత్వం అందించే పథకాలు, రాయితీలు, సేవలను పొందాలంటే అర్హులు తప్పనిసరిగా ఆధార్‎ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ లేకపోతే ఏంటి పరిస్థితి అనుకోవచ్చు. అందుకు ఓ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది.

ఆధార్ లేని వారిని గుర్తించి వారికి దరఖాస్తులు అందించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లోనే లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలంది. అంతే కానీ ఆధార్ లేదన్న కారణంతో అర్హులకు అందాల్సిన పథకాలను ఆపకూడదని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ఆధార్ కోసం అప్లై చేసుకున్న వారికి 3 నెలల్లో ఆధార్ నంబరు కేటాయించాలంది. అనంతరం వారు పొంతే పథకాలకు అనుసంధానం చేయాలని తెలిపింది సర్కార్.

Updated : 8 July 2023 8:33 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top