Home > ఆంధ్రప్రదేశ్ > TTD పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

TTD పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

TTD పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
X



థంబ్ : శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు

నేడు టీటీడీ పాలకమండలి సమావేశమయ్యింది. ఆగస్టు 8వ తేదితో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో అన్నమయ్యభవన్ లో ఆఖరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల మౌలిక సౌకర్యాలకు, టీటీడీ అభివృద్ధి పనులకు కోట్లు రూపాయాలను కేటాయించారు. సమావేశం అనంతరం పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

టీటీడీ పాలకమండి నిర్ణయాలు..

*అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షెడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు కేటాయింపు

*రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు

*23.5 కోట్లతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం

* ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు కేటాయింపు

* 5 కోట్లు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపు

*రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు

*రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ

*రూ.3 కోట్లతో శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణం

*రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు

*రూ.9.85 కోట్లతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ధి పనులు

*రూ.2.6 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

*శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయింపు

*ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్ల కేటాయింపు

* యాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్ల కేటాయింపు

* రుమతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కేటాయించారు. అదే విధంగా అలాగే, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్లు పొడిగించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.


Updated : 7 Aug 2023 1:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top