Home > ఆంధ్రప్రదేశ్ > తెలంగాణకు కిషన్, ఏపీకి పురంధేశ్వరీ.. బీజేపీ ప్రకటన

తెలంగాణకు కిషన్, ఏపీకి పురంధేశ్వరీ.. బీజేపీ ప్రకటన

తెలంగాణకు కిషన్, ఏపీకి పురంధేశ్వరీ.. బీజేపీ ప్రకటన
X

తెలంగాణ బీజేపీలో అనుకున్నదే జరిగింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంకోసం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాల మధ్య.. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న సంజయ్.. జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తన రాజీనామాను అందజేశారు. నడ్డాతో భేటీ అనంతరం తన రాజీనామాను బండి సంజయ్ ప్రకటించారు. కిషన్ రెడ్డితోపాటు, తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేందర్ సింగ్ షెకావత్, పంజాబ్ బీజేపీ చీఫ్ గా సునీల్ జక్కర్, ఝార్కండ్ పార్టీ ఛీఫ్ గా మాజీ సీఎం బాబులాల్ మారండిలకు పదవులను కట్టబెట్టింది.








Updated : 4 July 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top