Home > ఆంధ్రప్రదేశ్ > Kodali Nani : వైఎస్ షర్మిలకు కొడాలి నాని కౌంటర్

Kodali Nani : వైఎస్ షర్మిలకు కొడాలి నాని కౌంటర్

Kodali Nani  : వైఎస్ షర్మిలకు కొడాలి నాని కౌంటర్
X

వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.5 వేల పెన్షన్ ఇవ్వకుండా ఏపీలో ఇస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదని ఆయన రాహుల్ గాంధీ ఎంపీగా గెలవరని నాని అన్నారు. సిద్ధం సభకు 600 కోట్లు ఖర్చుచేశారన్న షర్మిల కామెంట్స్ వివరణ ఇచ్చారు. వైసీపీకి షర్మిల అకౌంట్స్ చూస్తున్నారా? సిద్ధం సభకు 600 కోట్లు షర్మిల ఏమైనా అకౌంట్లో వేశారా అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిస్పోజల్ పార్టీ. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 5000 పింఛన్ ఇవ్వకుండా ఆంధ్రాలో ఇస్తానంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు. ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ అన్న చంద్రబాబు సిగ్గులేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంకోసం ఎన్నిమోసాలయినా చేస్తాడు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడంటూ నాని విమర్శించారు.2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోదీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని అన్నారు. ఏపీ భవిష్యత్‌ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలతో సిగ్గు లేకుండా పొత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.




Updated : 12 March 2024 5:52 PM IST
Tags:    
Next Story
Share it
Top