Home > ఆంధ్రప్రదేశ్ > చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని
X

గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. మెగా అభిమానులతో కలిసి కేట్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను ఎప్పుడు విమర్శించలేదని చెప్పారు. ఇటీవల తాను చేసి పకోడి గాళ్లు వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేయలేదని... తాను మెగాస్టార్ ను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి సవాల్ విసిరారు. తాను శ్రీరామ అన్నా సరే టీడీపీ, జనసేనకు బూతులుగానే వినపడతాయని ఎద్దేవా చేశారు. చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదన్నారు.

రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని చెప్పారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లపైకి వచ్చి...చిరంజీవికి, మాకు మధ్య గ్యాప్ సృష్టించాలని చూశారని ఆరోపించారు. అదే విధంగా చిరంజీవి చేసిన సూచనలు పాటిస్తామన్నారు. మాకు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్లకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పానని వివరించారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని చెప్పారు.

ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్ వేడుకల్లో మెగాస్టార్ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. ఆయన ప్రభుత్వానికి చేసిన నూసనలపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. కొడాలి నాని సైతం ఫైర్ అయ్యారు. పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు తమ వారికి రాజకీయాలు ఎందుకు, డాన్స్, ఫైట్స్ యాక్షన్ మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు.దీంతో మెగా అభిమాలనులు ఆందోళన కు దిగారు. కొడాలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఉన్నట్టుండి చిరంజీవి పుట్టినరోజుల వేడుకల్లో పాల్గొన్న కొడాలి...మెగాస్టార్ పై ప్రేమను చాటుకోవడం హాట్ టాపిక్‎గా మారింది.

Updated : 22 Aug 2023 3:42 PM IST
Tags:    
Next Story
Share it
Top