Home > ఆంధ్రప్రదేశ్ > సీజేఐకి కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు లేఖ

సీజేఐకి కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు లేఖ

సీజేఐకి కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు లేఖ
X

సీఎం జగన్‌‌పై కోడికత్తితో దాడి జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తనకు జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. విచారణను వేగంగా ముగిసేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నాడు. తనకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదని గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని… ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి గతంలో లేఖ రాసిన విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకువెళ్లాడు. తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించానని అయినా ఎటువంటి స్పందన రాకపోవడంతో లేఖ రాస్తున్నానని తెలిపాడు

కోడికత్తి కేసుపై గురువారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది విచారణకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తోపాటు ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని విచారణ ముగించాలని ఎన్ఐఏ వాదనలు వినిపించింది. తదుపరి విచారణను జులై 4కి వాయిదా వేశారు.

Updated : 15 Jun 2023 9:51 PM IST
Tags:    
Next Story
Share it
Top