Home > ఆంధ్రప్రదేశ్ > కోటీశ్వరుడైన కర్నూలు రైతు..పొలంలో దొరికిన విలువైన వజ్రం

కోటీశ్వరుడైన కర్నూలు రైతు..పొలంలో దొరికిన విలువైన వజ్రం

కోటీశ్వరుడైన కర్నూలు రైతు..పొలంలో దొరికిన విలువైన వజ్రం
X

వర్షాకాలం మొదలైందంటే చాలు సీమ జిల్లాల రైతుల ముఖాలు వెయ్యి వోల్టుల బల్బుల్లా వెలిగిపోతుంటాయి. తొలకరి వానలు కురిసే సమయంలో తమ పొలాల్లో వజ్రాల వేటను ప్రారంభించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఇక్కడి ప్రజలు. ఇలాంటి తవ్వకాల్లో సాధారణ రైతులు లక్షాదికారులు, కోటీశ్వరులైన దాఖలాలు లేకపోలేదు. వాస్తవానికి రాయలసీమకు రతనాల సీమ అనే పేరు ఉంది. ఇది అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. అందుకే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతూ రత్నాల కోసం అన్వేషిస్తుంటారు ప్రజలు. సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటి వరకు రైతులు తమ పొలాల్లో చేపట్టిన తవ్వకాల ద్వారా ఎక్కువగా వజ్రాలు బయటపడ్డాయి.

కర్నూలులో ప్రస్తుతం తొలకరి జల్లులు పడుతుండటంతో ప్రజలు వజ్రాల వేటను మొదలు పెట్టేశారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చన్న ఆశతో స్థానిక ప్రజలంతా ఇదే పనిలో బిజీ బిజీగా మారారు. ఈ క్రమంలో జిల్లాలోని కొంత మందికి వజ్రాలు దొరికాయి. అందులో బసనేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. పొలం పనులు చేస్తుండగా ఈ విలువైన వజ్రాన్ని గుర్తించాడు రైతు. విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు రైతు ఇంటికి క్యూ కట్టారు. ఈ వజ్రం ధర రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. గుత్తికి చెందిన ఓ వ్యాపారి ఈ వజ్రాన్ని కొన్నాడని తెలుస్తోంది. దీంతో ఆ రైతు కాస్త కోటీశ్వరుడయ్యాడు. గతంలోనూ కర్నూలు జిల్లాల్లో ఎంతో విలువైన వజ్రాలు స్థానికుల తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ వజ్రాలు కోట్ల ధర పలికిన సందర్భాలు ఉన్నాయి.

Updated : 6 Jun 2023 6:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top