పురాతన ఇంట్లో బయటపడిన లంకెబిందలు..తెరిచి చూస్తే..
X
రాయలవారు ఏలిన సీమ రాయలసీమను రత్నాల సీమగా పిలుస్తుంటారు. ఈ కాలంలో రత్నాలు రాసులుగా పోసి వీధుల్లో అమ్మేవారని అందుకే రాయలసీమకు ఈ పేరు వచ్చిందని మన చరిత్ర చెబుతోంది. అలాంటి సీమలో ఇప్పటి వరకు ఎన్నో నిధి నిక్షేపాలు చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. రైతుల పొలాల్లో ఎన్నో కోట్ల విలువైన వజ్రాలు దొరికాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలంలో శరణ బసప్ప తన పురాతన ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం పనులు చేస్తుండగా తవ్వకాల్లో ఈ లంకెబిందె బయటపడింది.
పురాతన లంకెబిందె బయటపడటంతో స్థానికంగా కలకలంరేగింది. ఈ బిందెలో విలువైన నిధి ఉండి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో శరణ బసప్ప రెవెన్యూ అధికారులకు వెంటనే సమాచారం అందించాడు. దీంతో శరణ బసప్ప ఇంటికి వచ్చిన అధికారులు లంకె బిందెను స్వాధీనం చేసుకుని దానిని తెరిచారు. ఈ బిందెలో 1897 సంవత్సరానికి చెందిన రాగి నాణేలు, 1900 నాటి బ్రిటిష్ సర్కార్ ముద్రించిన వెండి నాణేలు ఉన్నట్లు తహసీల్దార్ తెలిపారు.