Home > ఆంధ్రప్రదేశ్ > Sharmila : షర్మిలతో వామపక్ష నేతల భేటీ...ఏపీలో 20 ఏండ్ల తర్వాత కాంగ్రెస్తో పొత్తు

Sharmila : షర్మిలతో వామపక్ష నేతల భేటీ...ఏపీలో 20 ఏండ్ల తర్వాత కాంగ్రెస్తో పొత్తు

Sharmila : షర్మిలతో వామపక్ష నేతల భేటీ...ఏపీలో 20 ఏండ్ల తర్వాత కాంగ్రెస్తో పొత్తు
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. అధికార పార్టీని దించడమే లక్ష్యంగా పొత్తు రాజకీయాలతో వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా పొత్తులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఏపీలో అదమ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు జీవం పోసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలను తీసుకువస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ విడుదల చేయాలని జగన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడలో పొత్తులపై కాంగ్రెస్, వామపక్ష నేతల భేటీ అయ్యారు. ఏపీలో దాదాపు 20 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ తో పొత్తుకు వామపక్షాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వైఎస్ షర్మిలతో సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్ భేటీ అయ్యి పోత్తులపై చర్చించారు. పోటీ చేసే సీట్లు, మేనిఫెస్టో పై ఇరుపార్టీల నేతలు చర్చలు జరిపారు. ఇప్పటికే ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం పార్టీలు ఉన్నాయి. జగన్ ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేస్తా అన్నారని షర్మిల గుర్తు చేశారు. ముకుమ్మడి రాజీనామాలు చేస్తామని...అధికారం వచ్చాక ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. మన రాజధానిని తాకట్టు పెట్టింది ఎవరో ప్రజలు గమనించాలని షర్మిల సూచించారు.

Updated : 23 Feb 2024 5:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top