Home > ఆంధ్రప్రదేశ్ > హమ్మయ్య.. బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది..అది ఎలాంటిదంటే!

హమ్మయ్య.. బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది..అది ఎలాంటిదంటే!

హమ్మయ్య.. బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది..అది ఎలాంటిదంటే!
X

తిరుమలలో ఐదేళ్ల చిన్నారి కౌశిక్‎పై దాడి చేసిన చిరుతను ఫారెస్టు అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 7వ మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. రెండు రోజుల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో కౌశిక్‎పై చిరుత దాడి చేసింది.

48 గంటల్లోనే చిరుతను పట్టుకోవడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం రాత్రి తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఓ చిరుతపులి ఐదేళ్ల బాలుడిపై దాడి చేసింది. బాలుడి మెడ పట్టుకుని అడవిలోకి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ చిరుత అలజడిని సృష్టించింది. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చిన ఐదేళ్ల కౌశిక్ తన తాతయ్యతో కలిసి స్నాక్స్ కోసం షాపు దగ్గరకు వచ్చాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న షాపు నిర్వాహకులు చిరుత వెంటే పరుగులు తీశారు. పెద్దగా అరుస్తూ దానిని వెంబడించడంతో బాలుడిని విడిచి చిరుత అడవిలోకి వెళ్లిపోయింది.





ఈ దాడిలో చిన్నారి శరీరానికి గాయాలయ్యాయి. వెంటనే టీటీడీ అధికారులు కౌశిక్‎కు తిరుమల పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్‎లో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా భక్తుల రక్షణ నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అటవీ అధికారులను రంగంలోకి దింపింది. చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో చిరుత బోనులో చిక్కినట్లు అటవీ అధికారులు కనిపెట్టారు." బాలుడిపై దాడి చేసిన చిరుతకు అసలు వేటాడటమే రాదు. ఇది చాలా మంచి చిరుత. దీని వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది. నిజానికి అలిపిరి మార్గంలో ఓ పిల్లిని పట్టుకునేందుకు చిరుత ట్రై చేసింది. దానికి బదులు పిల్లాడిని పట్టుకుంది. అందుకే పిల్లి అనుకుని అది బాబు మెడను పట్టుకుంది. ఈ చిరుత ఈ మధ్యనే తన తల్లి నుంచి వేరైంది. 2 రోజులుగా ఆహారం లేక అలమటిస్తోంది. అతి త్వరలోనే ఈ చిరుతను పుష్కలంగా ఆహారం లభించే అడవిలో వదిలుస్తాం. ప్రస్తుతం చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉంది"అని అధికారులు తెలిపారు.





Updated : 24 Jun 2023 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top