Home > ఆంధ్రప్రదేశ్ > వైజాగ్‌లో మద్యం లారీ బోల్తా... దండం పెట్టినా వినని మందుబాబులు..

వైజాగ్‌లో మద్యం లారీ బోల్తా... దండం పెట్టినా వినని మందుబాబులు..

వైజాగ్‌లో మద్యం లారీ బోల్తా... దండం పెట్టినా వినని మందుబాబులు..
X

మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కార్టన్లు భళ్లు బద్దలై సీసాలు అమృతభాండాల్లా బయపడ్డాయి. విషయం తెలిసిన మందుబాబులు ఆగమేఘాలపై వెళ్లారు. కొందరు కొన్ని ఎత్తుకెళ్లారు. మరిన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. చుట్టపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా పోటెత్తారు. పోలీసులు కూడా తుపాకులు వేసుకుని మరీ వచ్చారు. తర్వాత స్పాట్‌ నుంచి జనం ఒక్కసీసాను కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి లేకపోయింది. నోటి దగ్గరికొచ్చిన మందు దూరమైందని నిరాశతో వెనుదిగారు.

విశాఖపట్నం జిల్లా మధురవాడలోని కొమ్మద్ది వద్ద శనివారం ఆ సంఘటన జరిగింది. ఆనందపురం నుంచి వైజాగ్ వెళ్తున్నర ఈచర్ వామనం నడిరోడ్డులో బోల్తాపడింది. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా డ్రైవర్ కాపలాగా ఉన్నా ఫలితం లేకపోయింది. జనం అందినకాడికి ఎత్తుకెళ్లారు. డ్రైవర్ చేతులెత్తి మొక్కినా ఫలితం లేకపోయింది. చివరికి పోలీసులు రావడంతో దోపిడీకి తెరపడింది. కిందపడిన సీసాలపై మందుబాబులు ఆశ వదిలేసుకుని వెళ్లిపోయారు. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. కొన్ని వందల బాటిళ్లలోని మద్యం నేలపాలైంది.

Updated : 11 Nov 2023 5:01 PM IST
Tags:    
Next Story
Share it
Top