Train Accident : క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే ఆ ప్రమాదం : రైల్వే మంత్రి
X
విజయనగరం జిల్లాలో అక్టోబర్ 29న ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కంటకాపల్లి జంక్షన్ వద్ద ఆగివున్న విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును రాయగఢ్ ప్యాసింజర్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. లోకో పైలట్ క్రికెట్ చూస్తూ ట్రైన్ నడిపారని చెప్పారు.
ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విధుల్లో ఉన్న పైలట్ల తీరును నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రమాదానికి కారణమైన అంశాలను తెలుసుకుని అవి మళ్లీ జరగకుండా తగిన పరిష్కారం కనుగొంటామని చెప్పారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ లపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.