Home > ఆంధ్రప్రదేశ్ > లోక్సభలో విపక్షాల ఆందోళన.. 15 మంది ఎంపీల సస్పెన్షన్

లోక్సభలో విపక్షాల ఆందోళన.. 15 మంది ఎంపీల సస్పెన్షన్

లోక్సభలో విపక్షాల ఆందోళన.. 15 మంది ఎంపీల సస్పెన్షన్
X

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లోనూ రచ్చ కొనసాగింది. దీంతో లోక్ సభలో ప్రతిపక్షపార్టీలకు చెందిన 15 మంది ఎంపీలపై వేటు పడింది. వింటర్ సెషన్ పూర్తయ్యేవరకు వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తొలుత ఐదుగురిని బహిష్కరించగా.. ఆ తర్వాత మరో 9 మందిపై వేటు పడింది. సభాపతి ఆదేశాలను ఉల్లంఘించారనే కారణంనల వీరిపై చర్యలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.

సస్పన్షన్‌కు గురైన ఎంపీల్లో ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతి మణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ లు స్పీకర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్‌ సభను మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలైన మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎస్ ఆర్ పార్తిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్. వెంకటేశన్, సీపీఐ ఎంపీ కె. సుబ్బరాయన్ లను సస్పెండ్‌ చేయాలంటూ ప్రహ్లాద్‌ జోషీ సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

లోక్ సభలో భద్రతపై స్పీకర్ ఓం బిర్లా బుధవారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుని కొన్నింటిని అమలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 14 Dec 2023 4:37 PM IST
Tags:    
Next Story
Share it
Top