త్వరలోనే లోకేశ్, అచ్చెన్నాయుడు అరెస్టు : మంత్రి రోజా
X
స్కిల్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బాబు అరెస్టును వైసీపీ స్వాగతిస్తుండగా, టీడీపీ శ్రేణులు, జనసేన, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాబుపై జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధిస్తోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండా తాజాతా ఈ అంశంపై వైసీపీ మంత్ర రోజా స్పందించారు. మీడియా ముఖంగా రోజా మాట్లాడుతూ స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే అని చెప్పారు. తన అధికారాన్ని దోపిడికి ఉపయోగించుకున్నారని అన్నారు. త్వరలోనే లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా అరెస్టు అవుతారని తెలిపారు.
మీడియాతో రోజా మాట్లాడుతూ.." ఇవాళ ఏపీలో చట్టాలన్నీ గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య విజయం. ఇది న్యాయ దేవత సాధించిన విజయం. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం. రూ.241 కోట్లను కొల్లగొట్టి పక్కా ఆధారలతో చంద్రబాబు దొరికారు. చంద్రబాబు అరెస్టును ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు, దత్తపుత్రుడు, అనుబంధ సంస్థలు, పచ్చ మీడియా మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు నేను నిప్పు అని చెప్పి బాబు తన పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టారు.
బోగస్ కంపెనీలకు బాబు బ్రాండ్ అంబాసిడర్. అవినీతికి బాబు అనకొండ. దేశంలోనే చంద్రబాబు అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది. చంద్రబాబుపైన జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది చంద్రబాబు ముత్యం అని అంటున్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదు అవినీతిలో కూరుకుపోయిన ముత్యం. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే. తన అధికారాన్ని దోపిడి కోసం ఉపయోగించుకున్నారు. అధారాలు గుర్తించారు కాబట్టే కోర్టు రిమాండ్కు పంపించింది. రాజకీయ కక్ష సాధించాలనే చీప్ అలవాట్లు జగన్కు లేవు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీఎస్టీ అధికారులు లేఖ రాశారు. 2018లోనే ఏసీబీ విచారణను చంద్రబాబు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. త్వరలోనే అచ్చెన్నాయుడు, లోకేశ్ అరెస్ట్ అవుతారు" అని రోజా తెలిపారు.